Trending

6/trending/recent

New PRC : కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్‌ సమీర్‌ శర్మ

కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌వేవ్‌ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్‌ చేసుకోవాలని తెలిపారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని వివరించారు.

కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్‌ శర్మ చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని తెలిపారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని సీఎస్‌ పేర్కొన్నారు. జీతాలు తగ్గుతాయన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని తెలిపారు. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. 

ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్‌ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానకి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని తెలిపారు. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని చెప్పారు. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు.  

New PRC : కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్‌ సమీర్‌ శర్మ


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad