Trending

6/trending/recent

Walking house: నడిచే ఇల్లు.. ఇక వాటితో పని లేదంతే.. క్రియేటర్‌కు సలా కొట్టాల్సిందే..!

 Walking house: మనం ఉండే ఇంటికి కాళ్లుంటే.. అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెంటే వస్తే… ఎంత బావుంటుంది కదా… అలాంటి నడిచొచ్చే ఇల్లు ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఇంటిని ఫ్రాన్స్‌కు చెందిన ఓ త్రీడీ డిజైనర్‌ రూపొందించాడు. అయితే ఈ ఇంటికి ఉండే కాళ్లు కర్రకుర్చీలకు కదలకుండా ఉండే కాళ్లు లాంటివి కాదండోయ్‌.. ఇవి మన ఇంటిని ఎక్కడకు కావాలంటే అక్కడికి మోసుకొచ్చేస్తాయి.

వివరాల్లోకెళితే.. ఫ్రాన్స్‌లోని ‘యూబిసాఫ్ట్‌’ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్‌ ఎంకో ఎన్షెవ్‌ వైరైటీగా ఈ కదిలే కాళ్లు గల ఇంటిని రూపకల్పన చేశాడు. ఈ ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్‌ లెగ్స్‌’ అడుగులు ముందుకు వేస్తూ ఎక్కడకు నిర్దేశిస్తే అక్కడకు చేరుకోగలవట. ఎలాంటి మిట్టపల్లాలనైనా సునాయాసంగా దాటేస్తాయట. ఇదొక ‘రెట్రో–ఫ్యూచరిస్టిక్‌’ డిజైన్‌ అని ఎన్షెవ్‌ చెబుతున్నాడు. కాగా, ఈ నడిచే ఇంటికి ఆరు కాళ్లుంటాయి. ఎత్తు, లోతు ప్రదేశాన్ని బట్టి దాని కాళ్లను సెట్‌ చేసుకోగలదు. టూరిస్టుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ ఇంట్లో ఇద్దరు మనుషులు, ఒక పెంపుడు జంతువుతో కలిసి ఉండొచ్చట. ఇందులో బెడ్రూం, లివింగ్‌ ఏరియా, గెస్ట్‌ రూం, కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, బాత్రూమ్, పార్టీ చేసుకొనేందుకు వీలుగా టెర్రస్‌, హైక్వాలిటీ ఫర్నిచర్‌ సహా స్మార్ట్‌ టెక్నాలజీ కిటికీ గ్లాస్‌ కూడా ఉండటం విశేషం. ఇక ఇంటి కింది భాగంలో బైక్స్‌, కారు పెట్టుకోవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానెళ్లు, వాటర్‌ ట్యాంక్‌ కూడా ఉంటుంది.

ప్రస్తుతానికి డిజైన్ రూపంలోనే ఉన్న ఈ నడిచే ఇల్లును భవిష్యత్‌లో నిర్మించి చూపుతానని ఎంకో ఎన్షెన్ చెబుతున్నారు. అదే గనుక జరిగితే.. భవిష్యత్తులో పిక్నిక్‌లు లాంటి కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు కార్లకు బదులుగా ఇళ్లనే తీసుకు వెళ్ళిపోవచ్చేమో. వాహనాలకు బదులుగా ఇలాంటి ఇళ్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని త్రీడీ డిజైనింగ్‌ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Walking house: నడిచే ఇల్లు.. ఇక వాటితో పని లేదంతే.. క్రియేటర్‌కు సలా కొట్టాల్సిందే..!


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad