Trending

6/trending/recent

Vote Fine: ఓటు వేయకపోతే ఇకపై భారీ జరిమానా.. సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌.. ఇది నిజమేనా..?

 Election Commission: ఏ ఎన్నికలు జరగినా.. వంద శాతం ఓటింగ్‌ అనేది కలగానే మిగులుతోంది. స్థానిక ఎన్నికల్లో 100శాతం ఓటింగ్ జరగకపోయినా.. కొంచెం పర్వాలేదన్న విధంగా శాతం నమోదవుతుంది. అయితే.. ఓటు వేయని వారిపై చాలామంది బాహటంగానే విమర్శలు వస్తుంటాయి. ఓటు వేయని వారికి సంక్షేమ పథకాలు కట్ చేయాలని.. అదే విధంగా పలు అర్హతలను కూడా రద్దు చేయాలని సూచిస్తుంటారు. ఓటును వినియోగించుకోవాలని.. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు సూచించినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హడలెత్తించే వార్త వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. వారి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఎన్నికల కమిషన్‌ రూ.350 ఫైన్‌ను కట్‌ చేస్తుందన్న వార్త అందరినీ షాక్‌కు గురించేసింది. అలాంటిదేమీ లేదంటూ.. దీనిపై ఏకంగా ఎన్నికల కమిషనే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఫేక్‌ న్యూస్‌ మాత్రం వైరల్‌ అవుతూనే ఉంది.

దీంతో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని సృష్టించింది ఎవరు.. ఎందుకిలా చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. దీనికోసం ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగాన్ని కూడా రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినా ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుండటం ఇప్పుడు.. ఈసీకి తలనొప్పిగా మారింది. దీనిపై ఇప్పటికే.. వార్త కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయినా ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుండటం గమనార్హం.

Vote Fine: ఓటు వేయకపోతే ఇకపై భారీ జరిమానా.. సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌.. ఇది నిజమేనా..?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad