Trending

6/trending/recent

AP ENT Hospital Jobs: విశాఖపట్నం ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

 AP ENT Hospital Jobs: ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది కాంట్రాక్ట్‌/ ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఇందులో భాగంగా ఫార్మసిస్ట్‌, ఆడియో టెక్నీషియన్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, డార్క్‌ రూం అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ (స్పీడ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ), బీఫార్మసీ/ ఎంఫార్మసీలో ఉత్తీర్ణత సాధించాలి. వీటితో పాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు పని అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 01-12-2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను సూపరిండెంటెంట్‌, ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్‌, పెద్దవాల్తేరు, విశాఖపట్నం 530017 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 12-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad