PRC Unions Meeting With CM: పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు ముగిసాయి. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల తెలిపారన్నారు.
ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి సుప్రీంకోర్టు తీర్పు అవరోధం అయ్యిందన్నారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉందని సజ్జల పేర్కొన్నారు.