Trending

6/trending/recent

Tornadoes: అమెరికాలో విధ్వంసం సృష్టించిన టోర్నడోలు.. 80 మంది మృతి.. కొనసాగుతోన్న సహాయక చర్యలు..

Tornadoes: డజన్ల కొద్దీ టోర్నడోలు అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించాయి. టోర్నడోల ధాటికి 80 మంది మరణించారు. చరిత్రలోనే అతిపెద్ద హరికేన్‌ విజృంభణలో ఇదొకటి అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ అన్నారు. ఇది ఒక విషాదమని, ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో మాకు ఇంకా పూర్తిగా తెలియదని బిడెన్ అన్నారు. అలాగే టోర్నడో వల్ల పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది. శనివారం సుడిగాలి దాటిన తరువాత, సహాయక, రెస్క్యూ బృందం శిథిలమైన ఇళ్లు, దుకాణాలలో ఉన్న వారిని కాపాడారు.

తుపానులు, ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలో కనీసం 70 మంది చనిపోయారని, మృతుల సంఖ్య పెరుగుతోందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. కెంటుకీలో తుఫాను 200 మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉందని, 10 లేదా అంతకంటే ఎక్కువ కౌంటీలలో మరణాల సంఖ్య 100 దాటవచ్చని గవర్నర్ ఆండీ బెషీర్ శనివారం ఒక వార్తా సమావేశంలో చెప్పారు. తమ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత విధ్వంసకర సుడిగాలి అని ఆయన అన్నారు.

మేఫీల్డ్‌లోని కొవ్వొత్తుల తయారీ కర్మాగారం, ఇల్లినాయిస్‌లోని అమెజాన్ కార్యాలయం, అర్కాన్సాస్‌లోని నర్సింగ్‌హోమ్ కూడా తుఫాను బారిన పడ్డాయని బెషీర్ చెప్పారు. తుఫాను సమయంలో మేఫీల్డ్ ఫ్యాక్టరీలో దాదాపు 110 మంది ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, తమ రాష్ట్రంలోని ముహ్లెన్‌బర్గ్ కౌంటీలో కనీసం 10 మంది చనిపోయారని వివరించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి నేషనల్ గార్డ్ సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అత్యవసర సిబ్బంది మేఫీల్డ్‌కు చేరుకుంటున్నారని స్థానిక అధికారులు తెలిపారు.

మేఫీల్డ్‌లోని ప్రధాన అగ్నిమాపక కేంద్రం, అత్యవసర సేవా కేంద్రం తుఫానుకు దెబ్బతినడంతో రెస్క్యూ ప్రయత్నాలు క్లిష్టంగా మారాయి. నగరంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శనివారం ట్వీట్ చేశారు. బాధిత రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమెజాన్ కార్యాలయంలో ఒకరు మరణించినట్లు పోలీసు చీఫ్ మైక్ ఫిలిబాచ్ శనివారం ఉదయం తెలిపారు.

Tornadoes: అమెరికాలో విధ్వంసం సృష్టించిన టోర్నడోలు.. 80 మంది మృతి.. కొనసాగుతోన్న సహాయక చర్యలు..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad