Telangana Employees: తెలంగాణలో త్వరలోనే ఉద్యోగుల బదిలీలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ భేటీలో తెలంగాణలో ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధి విధానాలపై చర్చించారు. ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు టీజీవో అధ్యక్షురాలు మమత. ఉద్యోగులకు నష్టం జరగకుండా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం విభజన చేయాలని కోరామని మమత తెలిపారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ బాగున్నాయని, క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించారని చెప్పారు మమత. నెలలోపే ఉద్యోగుల ఆప్షన్ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారామె. కాగా, బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలోనే ఉంటుందని చెప్పారు ఉద్యోగ సంఘం నేతలు. అయితే, ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని కోరామని చెప్పారు.
Telangana Employees: ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు.. బదిలీల ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
December 06, 2021
0