మైనార్టీల విద్యాభివద్ధి కోసం కేంద్రం అందజేస్తున్న 'ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్' పథకానికి 2021 22 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1,378 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. గురువారం లోక్సభలో ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్లో 36.63 లక్షలు మైనారిటీలు ఉన్నారని, ఏపిలో ఏడాదికి మొత్తం 8,03,358 దరఖాస్తులకు గాను కేంద్రం 56,889 స్కాలర్ షిప్లు మాత్రమే ఇచ్చిందని ప్రశ్నించగా మంత్రి ఈ విషయం చెప్పారు. మైనార్టీ కమ్యూనిటీల లోని పిల్లలకు తగిన విద్యావకాశాలను కల్పిం చడం ముఖ్యమైన అంశమని శ్రీకృష్ణదేవ రాయలు అన్నారు. 2018 నుండి 2021 వరకు 1,70,667 స్కాలర్ షిప్ లు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ పథకం కింద నోటిఫైడ్ అయిన ఆరు మైనారిటీ కమ్యూనిటీ లకు సంబంధించి ఇప్పటివరకు 5,95,679 దరఖాస్తులు ధవీకరించినట్లు మంత్రి తెలిపారు. మరో 4,43,837 స్కాలర్షిప్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 2020-21 గానూ స్కాలర్షిప్ ల పంపిణీ ఇంకా కొనసాగుతోందని బదులిచ్చారు. రాష్ట్రాలకు వార్షిక నిధుల కేటా యింపు అనేది అందుబాటులో ఉన్న బడ్జెట్, రాష్ట్రంలో మైనారిటీల జనాభాపై ఆధారపడి ఉంటుందన్నారు. స్కాలర్షిప్ కు సంబంధిం చిన అన్ని అంశాలను స్కీమ్ రివిజన్ ప్రక్రియలో మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని తెలిపారు.
Premetric Scholorship: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి రూ. 1,378 కోట్లు
December 10, 2021
0
Tags