Trending

6/trending/recent

PRC News: సీఎం ప్రకటన విషయం ఉద్యోగ సంఘాలకు తెలియదు: బొప్పరాజు

అమరావతి: పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్‌ కాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చలకు మాత్రమే ప్రభుత్వం పిలిచిందని వెల్లడించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు. పీఆర్సీకి సంబంధించి సీఎం చేసిన ప్రకటనపై ఉద్యోగులెవరికీ సమాచారం లేదని పేర్కొన్నారు.

తిరుపతిలో తమ సంఘాలకు చెందిన ఉద్యోగులెవరూ సీఎంను కలవలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని వెల్లడించారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని బొప్పరాజు తేల్చి చెప్పారు.

ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.

PRC News: సీఎం ప్రకటన విషయం ఉద్యోగ సంఘాలకు తెలియదు: బొప్పరాజు


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad