Trending

6/trending/recent

PRC News: త్వరలోనే PRC పై తుది రూపు ఇస్తాం

• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని PRC ఉంటుంది
• నిన్నటి చర్చల సారాంశం, ఉద్యోగుల డిమాండ్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం
• భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తాం
• కరోనా వల్ల ఆర్థికపరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది
• సీఎం గారు ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారు
• త్వరలోనే చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తాం
• ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెల్లడి

తాడేపల్లిలోని సీఎం గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గారు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేడు కలిశారు. PRC పై బుధవారం ఉద్యోగులతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా సీఎం గారికి వివరించారు.

అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.. 'నిన్నటి చర్చల సారాంశం, ఉద్యోగుల డిమాండ్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం. ఫిట్‌మెంటుతో పాటు ఇతర విషయాలపై సీఎం గారితో చర్చించాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని PRC ఉంటుంది. ఉద్యోగులు కూడా సహకరించాలని కోరాము. భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తాం. కరోనా వల్ల ఆర్థికపరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది. గతంతో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి లేదు. త్వరలోనే ఈ అంశానికి తుది రూపు ఇస్తాం. ఉద్యోగుల ఆందోళన కూడా వాయిదా వేసుకోమని కోరాము. ఈ ఉద్యోగ సంఘాలు మరో మారు CS తో భేటీ అయ్యి ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారు. సీఎం గారు ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారు. త్వరలోనే చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తాం' అని అన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad