ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం తేది. 28-02-2021 న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లో ఎంపిక అయిన విద్యార్ధులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొనవలెను.
మరియు నవంబరు 2017, 2018, 2019 సంవత్సరములలో ఎంపిక కాబడి గత సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ విద్యార్ధి రెన్యువల్ చేసుకొనుటకు 31-12-2021 వరకు గడువును పొడిగించడమైనది అని జాతీయ మానవ వనరులశాఖ వారు తెలియజేసారు.
లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు.
పాఠశాల పరిధిలో మరియు జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో విద్యార్ధుల వివరములను ఆమోదించుటకు 15-01-2022 వరకు పొడిగించడమైనది.
కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు. మరిన్ని వివరములకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు వెంటనే సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.
16/1214
Scanned with CamScanner