Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకిపైగా జీతం పొందే అవకాశం..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Income Tax Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయి.

స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా అథ్లెటిక్స్‌ (ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌), బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, రోయింగ్‌ క్రీడాంశాలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ది ప్రిన్సిపల్‌ ఛీప్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కేరళ అడ్రస్‌కు పంపించాలి.

అభ్యర్థులను ఫీల్డ్‌ ట్రైల్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 31-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Below Post Ad


Post a Comment

0 Comments