Trending

6/trending/recent

Crime News: కసితీరా.. ఇంట్లో ఆ ఇద్దరినీ అలా చూసిన తండ్రి ఏం చేశాడంటే..?

 Man arrested: కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తి.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపాడు. ఇంట్లో కూతురితో చూసిన ఆయన ఒక్కసారిగా.. ఆవేశంతో రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న చెక్కను తీసుకోని.. యువకుడి తలపై కొట్టాడు. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. నవంబర్ 28న వినోభా నగర్‌లోని తన కూతురితో కలిసి ఉన్న 19 ఏళ్ల యువకుడిని హత్య చేసిన ఘటనలో 46 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు నగర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆటోరిక్షా డ్రైవర్‌ నారాయణ్‌ గా తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌ కూతురు, స్కూల్‌ మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో పక్కింటిలో నివాసం ఉండే నివేష్‌కుమార్‌ను ఆమె ప్రేమిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసుకున్న నారాయణ్ ముందుగా కూతురిని మందలించాడు. అయితే.. హత్య జరిగిన రోజు నారాయణ్ ఉదయాన్నే పనికి వెళ్లాడు. నివేష్ తన స్నేహితురాలిని కలిసేందుకు ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన నారాయణ్ అక్కడ ఉన్న నివేష్‌ను చూడగానే ఆవేశంతో రెచ్చిపోయాడని తెలిపారు.

నారాయణ్‌ వెంటనే అక్కడ ఉన్న చెక్క దుంగ తీసుకోని వివేశ్‌ కుమార్‌ తలపై కొట్టాడని.. దీంతో అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు నారయణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Crime News: కసితీరా.. ఇంట్లో ఆ ఇద్దరినీ అలా చూసిన తండ్రి ఏం చేశాడంటే..?


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad