తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. అయితే తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో గల పీరంచెరువు సమీపంలో ఉన్న ఒకే అపార్ట్‌మెంట్‌లో 10మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది.
అయితే ఈ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల దేశరాజధాని ఢిల్లీకి వెళ్లొచ్చాడు. అయితే అతని ద్వారా మిగితా వారికి కరోనా సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే రేపు ఉదయం అపార్ట్‌మెంట్‌వాసులందరికీ ర్యాపిడ్‌టెస్టులు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు