Employee Demands : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే....ఏక్షణమైనా మళ్లీ పోరాటానికి దిగుతాం ACB కేసు లకు భయపడం
newStoneDecember 20, 2021
1
Top Post Ad
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే....ఏక్షణమైనా మళ్లీ పోరాటానికి దిగుతాం - బొప్పరాజు
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్థికశాఖ మంత్రి, సిఎస్ హామీనిచ్చారని, అందుకోసమే తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేశామే తప్ప విరమించలేదని, ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.
ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జెఎసి రాష్ట్ర స్థాయి. సమావేశం విజయవాడ గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగింది.
సమావేశానికి హాజరైన బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోని పక్షంలో స్ట్రగుల్ కమిటీతో చర్చించిన అనంతరం ఏ క్షణాన్నైనా తిరిగి పోరాటానికి దిగుతామన్నారు.
ఈ విషయంలో ఉద్యోగులు ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 11వ పిఆర్సి కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని, ఐఆర్ 27శాతం ఇస్తుంటే ఫిట్మెంట్ 14.29శాతాన్ని అధికారులు ఎలా రెకమండ్ చేస్తారని, ఇది ఉద్యోగు లను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు.
14శాతానికి వెనక్కి వెళు తున్నారా? లేక ఐఆర్ 27శాతానికి ఫిట్మెంట్ 14.29శాతం కలిపి ఇవ్వబోతు న్నారా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాము ఎసిబి కేసులకు భయ పడే వారం కామన్నారు. ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చినప్పుడు ఒక అవకాశం ఇవ్వాలని భావించామన్నారు.
ఉభయ జెఎసి నాయకులపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా సిపిఎస్ ఉద్యోగులు పోస్టింగ్ లు పెడుతున్నార న్నారు. ఎవరిని అడిగి ఉధ్యమాన్ని నిలిపివేశారని పత్రికల ద్వారా అడుగుతున్నా రన్నారు.
సిపిఎస్ ఉద్యోగులకు ఎపి జెఎసి అమరావతి పక్షాన తాము ఎప్పుడూ సపోర్టు చేస్తూనే ఉన్నామన్నారు.
సిపిఎస్ నాయకత్వం ఎందుకు తమ జెఎసిలోకి రాలేదో ఉద్యోగులు తెలుసుకోవాలన్నారు. సిపిఎస్ ఉద్యోగులు సింహగర్జన పెడతే ఆ సభకు తాము వెళ్లి మద్దతునిచ్చామన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మండలిలో పోరాటం చేశారని, తాము ఉధ్యమం మొదలుపెట్టకముందే తమకు సంఘీభావంగా ఒక రోజు దీక్ష చేశారన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా వారితో తాము ఉంటామన్నారు..
Not satisfied with prc
ReplyDelete