Trending

6/trending/recent

Viral News: తవ్వకాల్లో బయటపడ్డ 800 ఏళ్ల నాటి మమ్మీ.. ఒళ్లంతా తాళ్లతో చుట్టి.. చూస్తే మీరూ షాకే.!

 ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు భూమిపై చాలానే ఉన్నాయి. వాటి కోసం పురావస్తు శాఖ అధికారులు ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా చాలా వింతలూ-విశేషాలూ రహస్యంగానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో పురావస్తు శాఖ అధికారులు 800 ఏళ్ల నాటి మమ్మీని వెలికితీశారు. ఆ మమ్మీని భూగర్భంలో ఓ సమాధిలో పూడ్చిపెట్టారు. దాని నుంచి బయటికి తీసిన తర్వాత శాస్త్రవేత్తలు ఆ మమ్మీ పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు.

పురావస్తు శాస్త్రవేత్త పీటర్ వాన్ డాలెన్ లూనా మాట్లాడుతూ.. ఆ మమ్మీ అవశేషాలు.. దక్షిణ అమెరికాలో ఆండియన్ ప్రాంతంలోని పర్వతాల సమూహ సమీపంలో ఒకప్పుడు నివసించిన తెగకు చెందినవారిదిగా కనుగొన్నారు. ఈ మమ్మీని లిమా ప్రాంతంలో కనుగొన్నామని.. ఇది పురుషుడిదా లేదా స్త్రీదా అనేది తెలియాల్సి ఉందని అన్నారు.

ఆ మమ్మీ తాళ్లతో కట్టబడి ఉందని.. అలాగే ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుందని అన్నారు. బహుశా అక్కడి అంత్యక్రియలు ఈ విధంగా జరిగి ఉండొచ్చునని డాలెన్ లూనా చెప్పారు. లిమా నగర శివార్లలో లభించిన భూగర్భ సమాధిలో ఈ మమ్మీ లభ్యమైందని ఆయన చెప్పారు. అదే సమయంలో సిరామిక్ వస్తువులు, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా మమ్మీతో పాటు సమాధిలో దొరికినట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ మమ్మీపై లోతుగా పరిశోధనలు చేస్తున్నామన్నారు. కాగా, ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో పెరూ ఒకటి. పురాతన చారిత్రాత్మిక కట్టడమైన ‘మచు పిచ్చు’ ఇక్కడే ఉంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad