చలికాలం వచ్చేసింది. కాలానుగుణ అంటువ్యాధులు.. అలెర్జీలతో పోరాడటానికి శరీరానికి మంచి సంరక్షణ అవసరమయ్యే కాలం ఇది. ఈ సమయంలో మన శరీరానికి తగినంత శక్తి, వేడి అవసరం అవుతుంది. అందువల్ల మీరు కూడా ఈ సీజన్‌లో వచ్చే ఆనారోగ్యసమస్యలతో పోరాడుతున్నట్లయితే.. మీ దినచర్యలో ప్రతి రోజు ఉదయం ఈ చేదు రసాన్ని చేర్చుకుని ఆరోగ్యంగా ఉండండి.
చక్కెర స్థాయి నియంత్రణకు..
కాకరకాయ రసం ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిచేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం మీ ఫుడ్ మెనూలో కాకర రసాన్ని చేర్చుకోవడం చాల మంచింది. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది ఐరన్ లెవల్స్‌ను మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది
ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పొట్లకాయ రసం తాగడం వల్ల కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కాలేయంలోని ఎంజైమ్‌లు వృద్ధి చెందుతాయి.
ఇంట్లోనే కాకరకాయ రసం ఎలా తయారు చేసుకోవాలి
ఇంట్లోనే కాకర కాయ రసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కకర కాయలను తీసుకుని ముందుగా వాటిని శుభ్రంగా కడిగి.. అందులోని గింజలను తీసివేసివేయండి. అనంతరం అందులో 1 కొద్దిగా అల్లం, చిటికెడు పసుపు, ఎండుమిర్చి, 4-5 పుదీనా ఆకులు, చిటికెడు నల్ల ఉప్పు కలపండి. రసాన్ని బ్లెండ్ చేసి 3 టీస్పూన్ల నిమ్మరసం వేసి మళ్లీ బ్లెండ్ చేసి తాగాలి.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
వైరస్‌లు బ్యాక్టీరియాలతో కాకరకాయ పోరాడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అలర్జీలు, అజీర్తిని నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఇది యాంటీ కార్సినోజెన్, యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ప్రోస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కళ్లకు మేలు చేస్తుంది
కాటరాక్ట్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది కాకరకాయ. ఇది మీ కళ్లకు మేలు చేసే బీటా కెరోటిన్, విటమిన్ ఎ వంటి లక్షణాలను కలిగి ఉంది. నల్లటి వలయాలకు కూడా ఇది తొలిగిస్తుంది.
మచ్చలేని చర్మం కోసం
కకర కాయ రసంలో విటమిన్ ఎ, సిలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చిన్న వయసులోనే వచ్చే చర్మంలోని ముడతలను తగ్గిస్తుంది.