ఉన్నత పాఠశాలలకు 3,4,5 తరగతులను అనుసంధానం చేసిన తర్వాత 12 తరగతులకు 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమిం చాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక పాఠ శాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే మధ్యాహ్న భోజనాన్ని ప్రాథమిక పాఠశాల ద్వారానే అందించాలని సూచించింది. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల మధ్య ఉంటే ఉన్నత పాఠశాల కింద భోజనం అందించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో ఎన్ని బడుల నుంచి 3,4,5 తరగతులు విలీనమయ్యాయి? ఎంతమంది విద్యార్ధులు వెళ్లారు? వివరాలను అందించాలని ఆదేశించింది.
3,4,5 తరలింపుపై స్పష్టతనివ్వాలి. అష్టా
ఉన్నత పాఠశాలలకు 3.4.5 తరగతుల తరలింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (ఆష్టా) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు కోరారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సర్దుబాటు, జీత భత్యాలపై స్పష్టత ఇచ్చిన తర్వాత తరలింపు చేపట్టాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ హామీ: ఒంటేరు
పాఠశాల సహాయకుల(ఎస్ఏ)కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పిం చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు ఉపా ధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. డీఈఓ పూల్లో ఉన్న భాషాపండితుల ఉన్నతీకరణ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులకు కనీస టైంస్కేల్ వర్తింపు, ఆర్ట్, క్రాప్టు సిబ్బంది సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.