వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలోని (2022-23) ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ డిసెం బరు 15 వరకు పొడిగించారు. ఈమేరకు నవోదయ విద్యాలయ సమితి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశా లలో అయిదో తరగతి చదువుతూ, 2009, మే ఒకటి నుంచి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో https://navodaya.gov.in/nvs/en/admission-jnvst-class/ www.navodaya.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఏడాది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అప్లోడ్ చేసే ధ్రువపత్రం (సర్టిఫి కెట్)పై కచ్చితంగా తాము చదివే పాఠశాల ప్రధానోపా ధ్యాయుడితో సంతకం చేయించుకోవాలనే నిబంధన తాజాగా విధించారు. ఇప్పటికే అప్లోడ్ చేసిన విద్యా ర్థులు సదరు సర్టిఫికెట్పై ప్రధానోపాధ్యాయుని సంతంకం, పాఠశాల సీలు వేయించుకుని వేలేరులోని. నవోదయ పాఠశాల కార్యాలయంలో అందజేయాలి.