Visit: ఆంధ్రప్రదేశ్‌లో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల పరిశీలనకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం వెళ్లింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బాగుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై మంత్రుల ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఆ కమిటీ సూచన మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, విద్య, సంక్షేమ మౌలిక వసతుల సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) ఎండీ పార్థసారథి, సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ రమేశ్ తదితరుల బృందం సోమవారం నుంచి ఏపీలో పర్యటిస్తున్నారు. తొలిరోజు నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో మూడు పాఠశాలలను పరిశీలించారు. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు మురళి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తదితరులను కలిసి నాడు-నేడు పథకం అమలు తీరు గురించి చర్చించారు.
Visit: ఏపీలో పాఠశాలల పరిశీలనకు తెలంగాణ విద్యాశాఖ బృందం..
June 15, 2021
0