English Medium: డిగ్రీ ఇక ఇంగ్లీష్ మీడియంలోనే..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • కళాశాలలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు

English Medium: రాష్ట్రంలో ఇకపై డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియం కనుమరుగు కానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడి యంలోనే అన్ని కోర్సుల బోధన జరగనుంది. సోమవారం ఉన్నత విద్యామండలి: దర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేసిన ప్రకట నలో ఈ విష యాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మాధ్యమంలో నడుస్తున్న డిగ్రీ కళాశా లలన్నీ రాబోయే వి ద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి తప్పని సరిగా మారాల్సి ఉంటుం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2021-22 విద్యాసంవ త్సరం నుంచి రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీల స్థానం లో నాలుగేళ్ల హానరరీ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్న విష యం తెలిసిందే. అయితే ఈ నాలు గేళ్ల డిగ్రీ పూర్తిగా ఇం గ్లిష్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్ -2లో ఉన్న లాంగ్వేజ్ సబ్జెక్టుకు మా త్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగు మీడియంలో కొనసా గుతున్న కళాశాలలు ఇంగ్లీష్ మీడి యానికి మారేందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ నెల 18 నుంచి 28 వరకు ఆయా కళాశా లలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులను పంపాలని సూచించారు. దర ఖాస్తులు పంపకపోతే కోర్సులను నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశా రు. బోధనా మాధ్యమం మార్పునకు సం బంధించి కళాశాలలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 12 ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో ఉన్నత విద్యామండలి కార్య దర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.



Below Post Ad


Post a Comment

0 Comments