Vaccine Dose Gap: గ్యాప్‌ తగ్గిస్తేనే రక్షణ!

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Vaccine Dose Gap: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య ప్రస్తుతం ఉన్న 12-16 వారాల వ్యవధిని మళ్లీ 8 వారాలకు తగ్గించాలని బ్రిటన్‌కు చెందిన అధ్యయనం ఒకటి అభిప్రాయపడింది. భారత్‌లో సెకండ్‌వేవ్‌కు కారణంగా భావిస్తున్న డెల్టా వేరియంట్‌ను (బీ.1.617.2) ఎదుర్కొనే యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) రెండో డోసు వేసుకున్న తర్వాతనే అభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. ‘ఒక్క డోసు రక్షణతో డెల్టా వేరియంట్‌ వ్యాప్తిని కట్టడి చేయలేం’ అని ఎన్సీడీసీ-ఐజీఐబీ పరిశోధకులు చెప్పినట్టు వెల్లడించింది. కొవిషీల్డ్‌ మొదటి డోసు వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ నుంచి 33 శాతం మాత్రమే రక్షణ లభించగా, రెండు డోసులు వేసుకున్న మూడు వారాల అనంతరం 60 శాతం వరకు రక్షణ లభించినట్టు అధ్యయనం పేర్కొంది. ‘దేశంలో డెల్టా వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం మంచిది’ అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కే శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని కేంద్రం గత నెలలో 12-16 వారాలకు పెంచింది.



Below Post Ad


Post a Comment

0 Comments