Meeting on NEP: జూన్ 17న విద్యామంత్రితో ఉపాధ్యాయ సంఘాల భేటీ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • కొత్త విద్యా విధానంపై చర్చకు నిర్ణయం

Meeting on NEP: జూన్ 15 ఆంధ్రప్రదేశ్ లో కొత్త విద్యా విధానంపై ఉపాధ్యాయ లోకం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారితో మాట్లాడాలని నిర్ణయించింది. రాష్ట్రం లోని అన్ని గుర్తింపు పొందిన, గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంతకుముందే హామీ ఇచ్చినట్లు సమావేశపు తేదీ ఖరారయింది. జూన్ 17న వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో ఈ సమావేశం ఉంటుంది. అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సంఘాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు, లేదా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ ప్రతాపరెడ్డి మెమో జారీ చేశారు..




Below Post Ad


Tags

Post a Comment

0 Comments