AP Curfew Relaxations: ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ సడలింపులు.. ఎంతవరకు అంటే.? వివరాలు ఇవే..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. రాష్ట్రంలో గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇవ్వగా.. శుక్రవారం నుంచి ఈ రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది. దీనితో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి. ఇవి ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు పనిచేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జూన్ 20 వరకు రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను అనిల్ సింఘాల్ ఆదేశించారు.

ఏపీలో కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించగా, 8,110 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడటంతో.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది. నిన్న కరోనాతో పోరాడుతూ 67 మంది మృత్యువాతపడ్డారు.



Below Post Ad


Post a Comment

0 Comments