WhatsApp Privacy Policy: తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది..
ఈ ఏడాదిలో ప్రారంభంలో వివాదాస్పద పాలసీ నిర్ణయంతో వాట్సాప్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీని అంగీకరించని ఖాతాదారుల అకౌంట్లను డిలీట్ చేయబోమని ప్రకటించింది.
తమ ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాలసీపై పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం విధితమే
వాట్సాప్ కొత్త పాలసీని అంగీకరించాల్సిందేనని స్పష్టం చేయడంతో చాలా మంది యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్‌లకు వైపు మొగ్గు చూపారు.
దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన వాట్సాప్ జరగబోయే నష్టాన్ని గుర్తిస్తూ.. 15 గడువును ఎత్తివేస్తూ ప్రకటన చేశారు.