Smile can increase Oxygen Levels: నవ్వితే శరీరంలో ఆక్సిజన్ పెరుగుతుందా..? లాఫింగ్ థెరపీ వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..!

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Smiling Increase Oxygen : కరోనా వల్ల ప్రజల్లో ఒత్తిడి, భయం పెరిగి అసలు నవ్వడమే మరిచిపోయారు. ఇది వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. 

కరోనాను ఓడించాలంటే మనస్పూర్తిగా నవ్వడం అలవాటు చేసుకోవాలి. నవ్వు మన జీవితంలో ఆనంద క్షణాలను తీసుకురావడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నవ్వు మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు నవ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1) శరీరంలో శ్వాస వ్యాయామం చేయడానికి నవ్వు ఒక మార్గం అని చాలా పరిశోధనలు నిరూపించాయి. ఇది మన శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

2) నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కనుక ఎప్పుడూ బహిరంగంగా నవ్వడం అలవాటు చేసుకోవాలి.

3) కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నవ్వు కూడా వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నవ్వు శరీరం యాంటీవైరల్, ఇన్ఫెక్షన్-నిరోధక కణాలను పెంచుతుంది.

4) నవ్వు కూడా నొప్పిని తగ్గిస్తుంది. లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. మీరు 10 నిమిషాలు చిరునవ్వుతో ఉంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

5) నవ్వు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి అనుకూలతను తెస్తుంది. మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది.



Below Post Ad


Post a Comment

0 Comments