Trending

6/trending/recent

SBI Alert: కస్టమర్లకు అలర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ మారాయి.. కేవలం ఈ 4 సేవలు అందుబాటులో

SBI Alert: మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ బ్రాంచు టైమింగ్స్ మారాయి. అంతేకాకుండా బ్యాంకుల్లో కేవలం 4 రకాల సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి

  • బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్
  • ఎస్‌బీఐ కీలక నిర్ణయం
  • ఆ 4 సేవలు మాత్రమే అందుబాటులో
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. కరోనా వైరస్ కఠిన పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఎస్‌బీఐ ఖాతాదారులు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్యాంక్ ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్‌ను మార్చేసింది.

అంతేకాకుండా బ్యాంకుల్లో పలు సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆల్ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్లు అత్యవసర పనులు ఉంటేనే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలని బ్యాంక్ కస్టమర్లకు సూచించింది.

ఇకపై ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పని చేస్తాయి. మే 31 వరకు ఇదే టైమింగ్స్ వర్తిస్తాయని గమనించాలి. బ్యాంకులు 2 గంటలకు క్లోజ్ అవుతాయి. అంతేకాకుండా బ్యాంక్‌కు వెళ్లేవారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఎంట్రీ ఉండదు.

  • క్యాష్ డిపాజిట్, 
  • విత్‌డ్రా.. 
  • చెక్ బుక్ సంబంధిత పనులు.. 
  • డీడీ, నెఫ్ట్, ఆర్‌టీజీస్ పనులు, గవర్నమెంట్ చలాన్ వంటి పనులు
పై పనులు మాత్రమే చేస్తారు. అందువల్ల మీరు చిన్న చిన్న పనులకు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకపోవడం మంచిది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad