జిల్లా పంచాయతి అధికారి వారి కార్యాలయం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,
తేది : 17-05- 2021.
విచారణ నివేదిక
శ్రీయుత జిల్లా కలెక్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆదేశముల మేరకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు కోవిడ్ 19 నకు ఆయుర్వేద చికిత్స పై జిల్లా పంచాయతి అధికారి వారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారు, రెవిన్యూ డివిజనల్ అధికారి, నెల్లూరు వారు, ఆయుర్వేద డాక్టర్లు మరియు స్థానిక మండల పరిషత్ అబివృద్ది అధికారి & తహసిల్దార్ వారితో విచారణ జరిపి సమర్పించు నివేదిక :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు శ్రీ బొరిగి ఆనందయ్య అనువారు కోవిడ్ 19 నకు ఆయుర్వేద చికిత్స చేయుచున్నారు. అతను, గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులైన శ్రీ గురవయ్య స్వామి మరియు చెన్నై పట్టణం రెడ్ హిల్స్ ప్రాంతమునకు చెందిన వివేకానంద అను సిద్ద వైద్యుల వద్ద ఆయుర్వేద చికిత్స నేర్చుకొన్ననని తెలిపియున్నారు. ఇతను గతములో సర్పంచ్ గా మరియు ఎం.పీ.టి.సి గా పనిచేసియున్నానని తెలిపియున్నారు. తను ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ మందు రోగులకు అందిస్తున్నని తెలిపినారు.
లోకాయుక్తకు సమర్పించిన పూర్తి అధికారిక రిపోర్టు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తాను, గత నెల శ్రీరామ నవమి నుండి అనగా 21-4-2021 నుండి కోవిడ్ 19 నకు చికిత్స చేయుచున్నననియు, మొదట పదులలో పేషంట్లు వచ్చేవారనియు తదుపరి ఆ సంఖ్య వందలకు పెరిగి ప్రస్తుతము రోజుకు 4 వేల నుండి 5 వేల మంది వరకు తాను ఇచ్చు ఆయుర్వేద మందు కొరకు వచ్చుచున్నారని నదని తెలిపినారు.
సదరు శ్రీ బొరిగి ఆనందయ్యను తాను కోవిడ్ 19 నకు తయారుచేయు మందుల యొక్క వివరములు తెలుపమని కోరగా వారు ఈ క్రింది విధముగా తెలిపియున్నారు.
అతను, కరోన నివారణ నిమిత్తం 5 (అయిదు) రకములైన మందులు తయారుచేసి పేషంట్లకు ఇచ్చుచున్నానని తెలిపి వాటిని తయారు చేయు విధానము ఈ క్రింద విధముగా తెలిపియున్నారు.
- మందుపేరు.
- వాడు పదార్థములు.
- కావలసిన మొత్తం.
- తయారుచేయు విధానము
- ఉపయోగించు విధానము.
- పత్యము.
మొదటి రకము: 1P - ఊపిరితిత్తులు శుభ్రం చేయును కరోనా పాజిటివ్ ఉన్న వారికి, లేని వారికి
రెండవ రకము: 2F - కరోనా పాజిటివ్ ఉన్న వారికి
మూడవ రకము: 3L - కరోనా పాజిటివ్ ఉన్న వారికి
నాల్గవ రకము: 4K - కరోనా పాజిటివ్ ఉన్న వారికి
ఐదవ రకము: 5I - ఆక్సిజన్ తగ్గిన వారికి, కంటి డ్రాప్స్
ఆయుర్వేద డాక్టర్ల నివేదిక
కావున, పై విచారణ తరువాత తమరికి సమర్చించుకోనునది ఏమనగా
సదరు ఆయుర్వేద చికిత్స కొరకు అవలంబించుచున్న ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావలసియున్నది మరియు చికిత్స తరువాత వచ్చు పరిణామాలపై పరీక్షలు జరగవలసియున్నది. కానీ నేటి వరకు సదరు చికిత్సపై ఎటువంటి వ్యతిరేక పిర్యాదులు గాని చికిత్స తరువాత తాము అనారోగ్యమునకు గురిఅయి ఉన్నామనిగాని ఎవ్వరును తెలిపియుండలేదు. మరియు అక్కడకు హాజరైన వారిలో ఒక పేషంట్ కు ఆక్సిజన్ లెవెల్స్ 83 ఉండగా అతనికి కంటిలో డ్రాప్స్ చేసిన గంట తరువాత అతని ఆక్సిజన్ లెవెల్స్ 95నకు పెరిగినవి. సదరు పేషంట్ తో మేము స్వయంగా మాట్లాడటం జరిగినది.కానీ, సదరు చికిత్స అందించు ప్రదేశము నందు ఎటువంటి కోవిడ్ నిబంధనలు పాటించుటలేదు. కావున, సదరు చికిత్స పై ఏదైనా నిర్ణయము తీసుకొను వరకు అచ్చట కోవిడ్ నిబంధనలు అమలు చేయునట్లుగా స్థానిక అధికారులను ఆదేశించవలసియున్నది.విచారణ నివేదిక తగు చర్య నిమిత్తము సమర్పితము.
Kidney 8.5 creatine ayurevadm medicine urgent require
ReplyDelete