SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ, ఇతర పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. అయితే ఇటీవల కేవైసీ సమర్పించడానికి మే 31వ తేదీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించింది. ఒక వేళ 31లోపు సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటనను ఎస్‌బీఐ ఉపసంహరించుకుంది. కేవైసీలను సమర్పించడానికి బ్రాంచ్‌లకు రావొద్దని సూచించింది. కరోనా నేపథ్యంలో వాటిని సమర్పించేందుకు బ్రాంచ్‌లకు రాకుండా ఎలా చేయాలో తెలియజేసింది.
అంతేకాదు వారిపై ఒత్తిడి కూడా చేయవద్దని కూడా అన్ని శాఖలకు సూచించింది. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు పోస్టు లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా అవసరమైన పత్రాలు పంపవచ్చని సూచించింది. సాధారణంగా ప్రతి ఒక్కరు కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారుల ఇబ్బందులను బట్టి కేవైసీ అప్‌డేట్ చేసుకునేందుకు రెండు లేదా, ఎనిమిదేళ్ల సమయం ఇస్తుంటుంది. ఆ సమయంలోగా కేవైసీ చేసుకోవాల్సి చెబుతుంటుంది ఎస్‌బీఐ. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి కేవైసీ ఇవ్వని పరిస్థితి ఉండటంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన విభాగాలకు ఆదేశించింది. కొంత కాలం కిందట ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ట్వీట్ తర్వాత ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గమనించాలని సూచించారు.