Gold Price On May 2nd 2021: బంగారం కొనేవారికి మరోసారి తీపికబురు. అదేంటీ అనుకుంటున్నారా ? నిన్నటి వరకు తగ్గతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ అంటే మే2 ఆదివారం రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నా.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన అవకాశంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా కొనసాగుతుంది.
ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,800గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. ఇక అలాగే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,370గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,570కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,800గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,110గా ఉంది. ఇక నిన్న శనివారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. జువెలరీ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.