Trending

6/trending/recent

Black Fungus: బ్లాక్ ఫంగస్‌కు మందులు కావాలా? ఇలా చేయండి.. మంత్రి సూచన

Black Fungus:  తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పలువరు మరణించారు. ఏపీలోనూ ఎక్కువ కేసులు వస్తుండడంతో వారంతా చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు.

కరోనా నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో వ్యాధి భారత్‌ను భయపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు మ్యుకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో దేశంలో చాలా చోట్ల కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఇన్‌ఫెక్షన్‌ను అంటు వ్యాధిగా గుర్తించింది. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలోవాడే మందులకు డిమాండ్ పెరిగిపోతోంది. చాలా చోట్ల మందులు దొరకడం లేదు. రెమిడెసివిర్‌ను బ్లాక్ మార్కెట్ చేసినట్లుగానే బ్లాక్ ఫంగస్ మందులను కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో తెలంగాన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ వివరాలను తాము పేర్కొన్న ఫార్మట్‌లో వివరాలను పంపిస్తే ప్రభుత్వమే మందులను అందజేస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

బ్లాక ఫంగస్ మందులు కావాల్సిన వారు dme@telangana.Gov.in మరియు ent-mcrm@telangana.Gov.inకు పూర్తి వివరాలతో మెయిల్ చేయాలి. పేషెంట్‌తో పాటు చికిత్స పొందుతున్న ఆస్పత్రి, ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అప్లికేషన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి DMETELANGANA, KTRofficeకు ట్యాగ్ చేస్తే వారు ఫాలోఅప్ చేస్తారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వమే వారికి మందులను పంపిణీ చేస్తుంది.

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పలువరు మరణించారు. ఏపీలోనూ ఎక్కువ కేసులు వస్తుండడంతో వారంతా చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. కరోనా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ వస్తే గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వ్యాధి సోకితే కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. లిపోసోమాల్ ఆంఫొటెరిసిన్ బీ, పొసకొనజోల్, ఇసవుకొనజోల్ మందులతో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ మందులను కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad