Telangana 10Th Results: తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను నేడోరేపో వెలువడే అవకాశం ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడోరేపో వెలువడే అవకాశముందని.. ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.
కరోనా ఉధృతి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
కానీ ఈ సారి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఒకసారి మాత్రమే జరగడంతో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి గ్రేడ్లు ఖరారు చేశారు.
వీరిలో దాదాపు సగంకి పైగా విద్యార్థులకు ఈ సారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉంది.
ఇప్పటికే విద్యాశాఖ మార్కుల అప్‌లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తోంది.
ఇప్పటికే పూర్తి అయినట్లు .. రెండు రోజుల్లో ఎప్పుడైనా ఫలితాలువెలువడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.