AP Inter Exams: ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 5 నుండి 23 వరకు జరగాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకొని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత పరీక్షల నిర్వహిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది.
ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 5 నుండి 23 వరకు జరగాల్సి ఉంది. మే 5 నుంచి 22 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
అయితే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణ వద్దని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి.
మరికొందరు ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో పరీక్షలు కొంతకాలం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కనిపిస్తోంది.