SBI offer: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. ఈ ఐదు ఆఫర్లు మీకోసమే.. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు అవకాశం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

SBI offer: మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్‌ ఉందా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఎస్‌బీఐ ‘యోనో’సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ప్రకటించింది ఎస్‌బీఐ. గత మూడు నెలల్లో యోనో సూపర్‌ సేవింగ్‌ పేరుతో ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి. వరుసగా మూడు నెలలు యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ప్రకటించింది. అయితే నాలుగు రోజుల పాటు ఆఫర్స్‌ అందిస్తోంది ఎస్‌బీఐ. ఆ ఆఫర్‌ సేల్‌ కూడా మొదలైంది. ఆఫర్స్‌ ఏప్రిల్‌ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తన ట్వీట్‌లో తెలిపింది. తమ కస్టమర్లకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. గత నెలలో 4 నుంచి 7వ తేదీ వరకు యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ఆఫర్స్‌ అందించడంతో లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో మరోసారి ఈ సేల్‌ ద్వారా ఆఫర్స్‌ అందిస్తోంది. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, హెల్త్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ లాంటి ప్రధాన కేటగిరిల్లో ఆఫర్స్‌ అందిస్తోంది. ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో 3.45 కోట్ల మంది యూజర్లకు ఆఫర్స్‌ అందిస్తోంది ఎస్‌బీఐ. అయితే ఇందు కోసం అమెజాన్‌, అపోలో, ఈజ్‌మైట్రిప్‌, ఓయో, హోమ్‌ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్‌బీఐ.

ఎలాంటి ఆఫర్స్‌ వర్తిస్తాయి

Amazon: మీరు అమెజాన్‌లో ఏవైనా కొనుగోలు చేయాలంటే ఎస్‌బీఐ యోనో ద్వారా లావాదేవీలు చేయండి. 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్‌ లబిస్తుంది.

Apollo 24|7: మీరు ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా మెడిసిన్‌, చికిత్స కోసం తీసుకోవాలనుకుంటే అపోలో కొంటే 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

Home: ఇంటికి సంబంధించిన ఫర్నీచర్‌ కొనుగోలు చేయాలంటే @హోమ్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్స్‌కు ఆకర్షణీచయమైన ఆఫర్‌స్‌ ఉన్నాయి. 12 శాతం అదనంగా తగ్గింపు పొందవచ్చు.

EaseMyTrip: ట్రావెల్‌ ప్లానింగ్‌ ఏవైనా ఉంటే ఈజ్‌మైట్రిప్‌ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ యోనో ద్వారా డొమెస్టిక్‌ విమానాలు బుక్‌ చేస్తే రూ.850 వరకు తగ్గింపు లభిస్తుంది.

OYO: ఎక్కడైన హోటల్‌ బుక్‌ చేసుకోవాలనుకుంటే ఓయో నుంచి ఆఫర్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్స్‌కు సంసబంధించి పూర్తి వివరాలు యోనో ఎస్‌బీఐ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇందు కోసం లాగిన్‌ అయిన తర్వాత Shop & Orderపై క్లిక్‌ చేసి Super Saving Days పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ నెల 7వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.


Below Post Ad


Post a Comment

0 Comments