Low Price Portable AC: తక్కువ ధరలో ఏసీ.. ఎక్కడైనా పెట్టొచ్చు.. మరెక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ఈజీ ప్రాసెస్.. రేట్‌ ఎంతో తెలుసా..?

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Low Price Portable AC: Portable Air Conditioner : కొత్తగా ఎవరైనా ఏసీ కొనేటప్పుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏసీ కొంటే అది గదిలో ఎక్కడ అమర్చాలి.. స్థలం ఉంటుందా ఉండదా అనే సమస్యలు వస్తాయి.. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి సరికొత్త ఏసీ వచ్చేసింది. దీనికోసం మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దీన్ని ఎక్కడైనా పెట్టొచ్చు.. అంతేకాకుండా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.. దీనిని పోర్టబుల్ ఏసీ అని పిలుస్తారు.. మీ ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే ఇది మీకు ఎలా సౌకర్యంగా ఉంటుంది.

పోర్టబుల్ ఏసీ అంటే ఏమిటి?

పోర్టబుల్ ఏసీ అనేది ఏ రకమైన గదిలోనైనా పెట్టుకోవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించవచ్చు. ఈ ఏసీలో చక్రాలు ఉంటాయి. అవి పరిమాణంలో చిన్నవి మరియు తక్కువ బరువు కలిగి ఉంటాయి. అంతేకాకుండా గది నుంచి వేడి గాలిని బయటికి పంపించడానికి వెనుక వైపు సుమారు 8 నుంచి 10 అడుగుల పైపు ఉంటుంది. ఇంటిల్లిపాది ఒకే ఏసీని కొనగలిగే వారికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. మీరు ఏ గదిలో ఉంటే అక్కడ ఏసీ అమర్చాల్సిన పని లేదు. పోర్టబుల్‌ ఏసీని డైరెక్ట్‌గా అక్కడికే తీసుకెళ్లొచ్చు. అంతేకాదు దీని ప్రత్యేకత ఏంటంటే కావలసిన ప్రదేశానికల్లా తీసుకెళ్లొచ్చు. ఇంటిల్లిపాది ఒకే ఏసీ పని చేస్తుంది.

గదిలో గోడపై ఒక్కోసారి ఏసీ పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కిటీకిలో అమర్చడానికి వీలుండదు అలాంటి పరిస్థితిలో పోర్టబుల్‌ ఏసీ చక్కగా సూటవుతుంది. మీరు దీనిని మీ మంచం దగ్గర ఉంచుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఇంటిని మారవలసి వస్తే, దీనిని సూట్‌కేస్ లాగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. మార్కెట్‌లో పోర్టబుల్‌ ఏసీకి 25 నుంచి 30 వేల రూపాయల మధ్య లభిస్తుంది. చాలా కంపెనీలు బ్లూస్టార్, మిడియా, లాయిడ్ మొదలైన కంపెనీలు వీటిని విక్రయిస్తున్నాయి.

Below Post Ad


Post a Comment

0 Comments