వైరస్ సోకినవారు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీస్ వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి.
పప్పు దినుసులు, చేపలు, చికెన్, మటన్ ఇతర మాంసాహారాల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇవికాకుండా పాలు, పెరుగు, గుడ్లు కూడా తీసుకోవచ్చు. ప్రూట్స్, వెజిటేబుల్స్‌లో ఆంటీక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. విటమిన్ డీ, బీ 12, అనీమియా, ఐరన్, జింక్ లోపం ప్రస్తుత పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు కూరగాయాలు తినాలి. డ్రైప్రూట్స్, నట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌లు ఏ, సీ, బీ, పొటాషియం ఉండే బొప్పాయి, ఆపిల్, గ్రేప్స్, మ్యాంగో, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు, పెరుగు, మాంసం, చేపలు కూడా తీసుకోవాలి . తక్కువ ఖర్చులో లభించే జామకాయలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ. బాదం, పిస్తాలతో పోలిస్తే కంది, పెసరపప్పులో మంచి ప్రొటీన్స్ ఉంటాయి.
బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం లాంటి ఫిజికల్ ఆక్టివిటీ చేయడం చాలా ముఖ్యం. డయాబెటిస్, ఒబేసిటీ, హైపర్‌టెన్షన్
ఉన్నవారు సాధారణ ఫిజికల్ ఆక్టివిటీ చేయడం అవసరం.