Gold ans Silver Rates today: బంగారం రేటు ఎప్పుడు పడుతుందో? ఎప్పుడుపెరుగుతుందో? ఎవరూ ఊహించలేం. వరుసగా 6 రోజుల పాటు పెరిగిన పసిడి ధరలు ఇవాళ పెరిగింది. వెండి రేటు స్వల్పంగా తగ్గింది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Gold rate on 30th April: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 44,300 రూపాయలు పలుకుతోంది. ఇవాళ రూ.150 మేర పెరిగింది. ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,430గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల బంగారం రూ.48,330కి దొరుకుతోంది. ఒక్క గ్రాము ధర.4,833గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 44,300గా ఉంటే..ఇతర నగరాల్లో కాస్త ఎక్కువ పలుకుతోంది. చెన్నైలో రూ.44,370, ముంబైలో రూ.44,480, న్యూఢిల్లీ రూ.45,680, కోల్‌కతా రూ.46,430, బెంగళూరు, రూ.44,300లకు లభిస్తోంది.
గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గిన బంగారం ధరలు.. మూడు సార్లు పెరిగాయి. మొత్తంగా ఈ నెలాఖారులో బంగారం బాగానే తగ్గింది. కరోనా కేసులు పెరగడంతో అన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలోనే బంగారంపై పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.73,300గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రేటు 733 రూపాయలు పలుకుతోంది. ఇవాళ రూ.2 మాత్రమే తగ్గింది. ఇక ఒక్క గ్రాము వెండి రూ.73.30కి లభిస్తోంది.
దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, చెన్నైలో వెండి ఒకే రేటు పలుకుతోంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.686గా ఉంది.