Trending

6/trending/recent

Central Cabinet Meeting: కరోనా కల్లోలం : ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

Central Cabinet Meeting - India COVID-19 situation: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడు వేలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, కరోనా వ్యాక్సిన్, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, అత్యవసరమైన ఔషధాలు తదితర ముఖ్యమైన అంశాలపై మంత్రులతో, అధికారులతో చర్చించనున్నారు.

కాగా.. కరోనా మహమ్మారిని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని మోదీ దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమవుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమై ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను తగ్గించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం పీఎం కేర్‌ నుంచి నిధులు విడుదల చేసింది. అలాగే దేశంలోని పలు ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌‌ను సరఫరా చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు పలు దేశాల నుంచి ఔషధ సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల దిగుమతిపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad