Trending

6/trending/recent

Fact Check: కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షల పరిహారం.. ఈ పథకంపై క్లారిటీ ఇదే..

 ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) పథకాలల్లో చేరి కరోనాతో మరిణించిన వారి కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు క్లెయిమ్​ చేసుకోవచ్చనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు నకిలీ వార్తలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది ఈ వార్త అసలైనదా? కాదా? అని నిర్థారించుకోకుండానే సోషల్​ మీడియాలో షేర్​ చేస్తున్నారు. ఇవి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) పథకాలపై ఇలాంటి ఫేక్​ ప్రచారమే జరుగుతోంది. ఈ పథకాలల్లో చేరి కరోనాతో మరిణించిన వారి కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు క్లెయిమ్​ చేసుకోవచ్చనే వార్త ఒకటి వాట్సాప్​ గ్రూప్​లలో చక్కర్లు కొడుతోంది. ఇది నిజమేనని నమ్మి చాలా మంది ఖాతాధారులు బ్యాంకులకు పరిగెత్తుతున్నారు.

ఇంతకీ వైరల్​ అవుతున్న పోస్ట్​లో ఏముందంటే.. “కోవిడ్–19 కారణంగా దగ్గరి బంధువు లేదా స్నేహితులు ఎవరైనా మరణించినట్లయితే వారి బ్యాంకు పాస్‌బుక్​ స్టేట్​మెంట్​ తనిఖీ చేయండి. దాంట్లో రూ. 12- లేదా రూ. 330- డిడక్షన్​ అయినట్లు కనిపిస్తే అతడు పీఎంజెజెబివై లేదా పీఎంఎస్​బీవై పథకాల్లో చేరినట్లేనని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, ఈ పథకం కింద రావాల్సిన రూ. 2 లక్షల కవరేజీని సంబంధిత బ్యాంకుకు వెళ్లి క్లెయిమ్​ చేసుకోండి" అనేది అసలు సారాశం. అయితే వాట్సాప్​ గ్రూప్​లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత? అనే దానిపై స్పష్టతనిచ్చింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి). ఈ రెండు పథకాలు కోవిడ్ మరణాలకు వర్తించవని, యాక్సిడెంట్​ లేదా శాశ్వత అంగవైకల్యం చెందిన సందర్భంలోనే వీటికి క్లెయిమ్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కోవిడ్​ మరణాలు ప్రమాదశాత్తు జరిగే మరణాలుగా పరిగణించరని తేల్చి చెప్పింది.

అసలు PMSBY పథకంలో చేరిన వారికి కరోనా డెత్​ క్లెయిమ్​ వర్తించదు. కానీ PMJJBY పథకంలో చేరిన వారి విషయంలో మాత్రం కొన్ని షరతులకు లోబడి డెత్​ క్లెయిమ్​ చేసుకోవచ్చని ఫ్యాక్ట్ చెక్ నివేదిక పేర్కొంది. తన పిఐబి ట్విట్టర్​ హ్యాండిల్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్ట్‌లకు ప్రజలు బలైపోకూడదని విజ్ఞప్తి చేసింది.

PMSBY పథకం గురించి..

ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం ఆయా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశ పౌరులందరికీ జీవిత బీమా ఉండాలనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. 2015 మే 9న ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ఒక సంవత్సరం పాటు రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఈ బీమా తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణించినట్లైతే.. నామినీకి పూర్తి కవరేజీ అందజేస్తారు. ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కస్టమర్లు రిజిస్ట్రేషన్​ ఫారమ్​ను నెట్​ నుంచి నేరుగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకుల్లో ఫారమ్​ తీసుకోవచ్చు. ఈ క్రమంలో పేరు, సేవింగ్స్​ బ్యాంక్​ ఖాతా నంబర్​ ఈ–మెయిల్​ ఐడి, చిరునామా మొదలైన వివరాలతో ఫారంలో నింపాల్సి ఉంటుంది.

అర్హత, ప్రీమియం వివరాలు..

ఈ పథకంలో చేరడానికి 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా ఉన్న ఏ వినియోగదారుడైనా ఈ పథకంలో లబ్ధిదారుడిగా చేరవచ్చు. ఏడాదికి ఒకసారి ఒకే మొత్తంలో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. తద్వారా, వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం లభిస్తుంది. ఒక్కసారి ఈ పథకంలో చేరితే ప్రతి సంవత్సరం ఈ అమౌంట్​ ఆటోమేటిక్​గా డెబిట్​ అవతుంది. అయితే, ఈ పథకంలో చేరేందుకు బ్యాంకులో ఖాతా తప్పనిసరిగా ఉండాలి. కస్టమర్​కి 50 ఏళ్ల వయస్సు దాటితే ఈ పాలసీ గడువు ఆటోమేటిక్​గా ముగుస్తుంది. 2020 సెప్టెంబర్ 11 నాటికి ఈ పథకంలో 74.6 మిలియన్ల మంది చేరారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad