ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై (SSC, Inter Exams) హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.
పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించగా.. పరీక్షలపై పునారాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
30 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన అంశంలో పునఃపరిశీలన చేసుకోవాలని పేర్కొంది.
పక్కరాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది.
పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.