Trending

6/trending/recent

Tenali Corona Cases: గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. తెనాలిలో ఒక్క రోజే ప్రమాదకరంగా నమోదైన కేసులు

కరోనా మరోసారి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఏపీలో కూడా క్రమక్రమంగా కరోనా వ్యాప్తి పెరుగుతుంది.  గుంటూరు జిల్లా తెనాలిలో కోవిడ్-19 కేసుల పెరుగుదల టెన్షన్ పెడుతుంది. మంగళవారం ఒక్క రోజే పట్టణంలో 24 కేసులు వెలుగుచూశాయి. నర్సింగ్‌ కాలేజీకి చెందిన 11 మంది విద్యార్థినులకు కొవిడ్‌ సోకినట్లు తేలింది. మున్సిపాలిటీలో పని చేసే ఎంప్లాయిస్, అధికారులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అలర్టైంది. నర్సింగ్‌ కాలేజీలో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో కళాశాలలోని స్టూడెంట్స్ అందరికీ కొవిడ్‌ టెస్టులు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా మూడు రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తొలుత తాడేపల్లి మండలంలో వైరస్ కేసులు పెరిగాయి. తాజాగా తెనాలిలో కొవిడ్‌ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో ప్రజల్లో టెన్షన్ నెలకుంది.

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ తదితర 19 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ధోరణి కనబడింది. మరణాల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా‌ తదితరచోట్ల కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ విధించటం మొదలుపెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఒడిశా ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే 1 నుండి 8 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఒడిశా స్కూల్‌ అండ్‌ మాస్‌ ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బుధవారం ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ చేస్తున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తించనుంది.

 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad