Trending

6/trending/recent

Telangana News: క‌రోనా క‌ల‌క‌లం.. త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం : ‌సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సూచనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలోని ప్రార్ధన మందిరాలను తిరిగి అదే స్థలంలో పునర్‌నిర్మిస్తామన్నారు. గతంలో ఉన్న రూ.200 పెన్షన్‌ను రూ.2వేలకు పెంచామని సీఎం కేసీఆర్ అన్నారు.

Source: NT News https://www.ntnews.com

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad