Trending

6/trending/recent

Rules: క్లాస్ లో మొబైల్ వద్దు, స్కూల్ కి జీన్స్, టీ షర్ట్, లెగిన్ లతో వద్దు...మరో సారి ఉత్తర్వులు జారీ

  • క్లాస్ లో మొబైల్స్ వాడవద్దు, స్కూల్ టైమ్ లో కూడా వద్దు
  • టీచర్స్ తో పాటు హెచ్.ఎం లు కూడా వాడొద్దు
  • జీన్స్, టీ షర్ట్, లెగిన్ ధరించ వద్దని ఆదేశం
  • వీడియో కాన్ఫరెన్స్ లో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాక అనుబంధంగా ఈ ఉత్తర్వులు జారీ
న్యూస్ టోన్,  మచిలీపట్నం: వీడియో కాన్ఫరెన్స్ లో మొబైల్ ఉపయోగించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన తరువాత దానికి అనుబంధంగా కృష్ణా జిల్లా విద్యా శాఖ మరో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉపాధ్యాయులు ఎవరూ హెచ్.ఎం తో సహా తరగతి లో మరియు స్కూల్ అవర్స్ లో మొబైల్స్ వాడవద్దని ఆదేశించారు. దీనితో పాటు ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్, లెగిన్ ధరించ వద్దని ఆదేశాలు జారీ చేశారు. మొబైల్స్ వాడకుండా స్టూడెంట్ అటెండెన్స్, ఐ ఎం ఎమ్ ఎస్ యాప్, మరియు ఇతర సమా చారం ఎలా పంపాలి అని ప్రధానోపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. యాప్ లో సమాచారం పంపాలి అని అడిగే వారే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాక ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad