ఎముకలు బలంగా ఉండాలంటే అందుకోసం ఉద్దేశించబడ్డ ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే, మన శరీరంలో ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా ఆహారం ఒక ప్రధాన కారణం అవుతుంది. ఆహారం తో పాటూ జీవన శైలి మార్పులు కూడా మన అవసరాన్ని బట్టి చేసుకుంటే హ్యాపీగా జీవించవచ్చు.
ప్రధానాంశాలు:
- నట్స్, సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యం
- కోల్డ్ వాటర్ ఫిష్ లో ఒమేగా 3
1. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్..
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కి చక్కని సోర్స్ కోల్డ్ వాటర్ ఫిష్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆరోగ్యానికి కావాల్సిన ఎస్సెన్షియల్ న్యూట్రియెంట్స్ ని అందిస్తాయి. వీటినే పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అని కూడా అంటారు. ఈ ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్స్ ని రెడ్యూస్ చేయడమే కాక బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి, గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది, డయాబెటీస్ ని ప్రివెంట్ చేసే ఛాన్సులు పెరుగుతాయి. ట్యూనా, సాల్మన్, ట్రౌట్, సార్డీన్స్ వంటి కోల్డ్ వాటర్ ఫిష్ లో ఒమేగా 3 లభిస్తుంది. లేదా, రోజూ ఒక ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా చేయవచ్చు.2. నట్స్, సీడ్స్..
వేగన్స్, వెజిటేరియన్స్ కి ఇది గుడ్ న్యూస్. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కొన్ని నట్స్, సీడ్స్ లో కూడా లభిస్తుంది. వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పైన్ నట్స్ వంటి రోజూ తగిన మోతాదులో తీసుకుంటే జాయింట్స్, కనెంటివ్ టిష్యూలో ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అవుతుంది.3. బ్రాసికా వెజిటబుల్స్
బ్రాసికా వెజిటబుల్స్ అంటే క్రూసిఫరస్ వెజిటబుల్స్. ఇవి బేసిక్ గా క్యాబేజ్ ఫ్యామిలీకి చెందినవి. మస్టర్డ్ గ్రీన్స్, అరుగుల, కాలే, పర్పుల్ క్యాబేజ్ వంటివి ఇందులో ఉంటాయి. బ్రకోలీ, కాలీ ఫ్లవర్, బ్రసెల్ స్ప్రౌట్స్ కూడా ఉంటాయి. ఈ వెజిటబుల్స్ లో మాత్రమే ఉండే ఒక ఎంజైమ్ జాయింట్స్ వద్ద వాపు రాకుండా చూస్తుంది. పైగా వీటిలో ఫైబర్, విటమిన్స్, న్యూట్రియెంట్స్ పుష్కలం గా ఉండడం వల్ల ఓవరాల్ హెల్త్ కి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.4. పండ్లు
పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటూ వాటిని త్వరగా తీసుకోవడానికి ఇష్టపడం. కానీ, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వెజిటబుల్స్ లాగానే పండ్లలో కూడా కొన్ని రకాలు ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. ఈ లిస్ట్ లో మొదటగా బ్లూ బెరీస్ ఉంటాయి. ఎందుకంటే, బ్లూ బెర్రీస్ లో యాంతో సియానిన్స్ అనే పవర్‌ఫుల్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి బాడీలో వచ్చే ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ని తగ్గిస్తాయి. ఆ తరువాత లిస్ట్ లో యాపిల్స్ ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఇవి గట్ హెల్త్ ని కూడా ప్రమోట్ చేస్తాయి. అలాగే, పైనాపిల్, టమాటాలు కూడా ఇందుకు బాగా హెల్ప్ చేస్తాయి.5. ఆలివ్ ఆయిల్
సాటీ చేయడానికీ, సలాడ్ డ్రెస్సింగ్స్ కీ తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. వీలున్నంత వరకూ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది అంతగా ప్రాసెస్ చేయని వెరైటీ. ఆలివ్ ఆయిల్ అన్‌శాచ్యురేటెడ్ హెల్దీ ఫ్యాట్స్ లిస్ట్ లో ఉంటుంది, దీన్ని ఎక్కువగా మెడిటరేనియన్ డైట్ లో వాడతారు. పైగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.6. పప్పులు
పప్పుల్లో ఫైబర్, ఎస్సెన్షియల్ మినరల్స్, ప్రొటీన్ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. పప్పుల్లో ఉండే యాంతో సియానిన్స్ ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తాయి.7. వెల్లుల్లి, దుంపలు
ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు.. వీటన్నింటికీ యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఆర్థ్రైటిస్, ఇంకా ఇతర జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ యొక్క లక్షణాలని ఇవి ట్రీట్ చేస్తాయి. వీటిని మీ ఆహారం లో చేర్చుకోండి.8. పూర్తి ధాన్యాలు
రిఫైండ్ గ్రెయిన్స్ లో ఉండే ప్రొటీన్ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ని పెంచుతుంది, అదే హోల్ గ్రెయిన్స్ లో ఉండే ఫైబర్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఇవి ఇన్‌ఫ్లమేషన్ తో పోరాడుతాయి.9. బోన్ బ్రాత్
హెల్దీ జాయింట్స్ కీ, బోన్ డెన్సిటీకీ బోన్ బ్రాత్ చాలా మంచిది. ఇది జాయింట్ పెయిన్ ని రెడ్యూస్ చేసి ఆర్థరిటిస్ తో బాధ పడే వారు ఇంకాస్త ఫ్రీగా కదలగలిగేలా చేస్తుంది. బోన్ బ్రాత్ ని వేడిగా తీసుకోవచ్చు, లేదా సాస్, కుకింగ్ బేస్ లా కూడా వాడుకోవచ్చు.10. డార్క్ చాకొలేట్
చాకొలేట్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాకొలేట్ లో ఉండే కొకోవాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వారసత్వంగా వచ్చే ఇన్‌ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతాయి. చాకొలేట్ లో ఎంత ఎక్కువ కొకోవా ఉంటే అంత ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే, చాకొలేట్ లో షుగర్, ఫ్యాట్ కూడా ఉంటాయని గుర్తు పెట్టుకుని, తగిన మోతాదులో మాత్రమే డార్క్ చాకొలేట్ తీసుకోండి.ఇవి తీసుకోవడం తో పాటూ రిఫైండ్ గ్రెయిన్స్, ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి తీసుకోవడం కూడా అవసరం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.