Cervical Cancer: క్యాన్సర్ లో అనేక రకాలు.. అయితే మహిళల్లో మాత్రమే
కనిపించేది గర్భాశయ క్యాన్సర్. ఎక్కువగా 15 నుండి 44 సంవత్సరాల మధ్య
వయస్సున్న మహిళలు దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత దేశంలో క్యాన్సర్
బారిన పడే మహిళల్లో 6 నుంచి 29 శాతం మంది గర్భాశయ క్యాన్సర్‌తోనే
బాధపడుతున్నారని ఓ నివేదికలో తేలింది. ఈ క్యాన్సర్ బారిన పడి 2019లో
ముఖ్యం గా 35 నుండి 39 సంవత్సరాల మధ్య ఉన్న 60,000 మంది మరణించారు. అందుకనే
ఈ క్యాన్సర్ పట్ల ప్రతి స్త్రీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ
నేపథ్యంలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, దాన్ని ముందుగానే ఎలా గుర్తించాలో
తెలుసుకోవాలీ.. ఎందుకంటే ప్రాధమిక దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్ నుంచి
సులభంగా బయటపడ వచ్చు..
గర్భాశయ క్యాన్సర్ లో సాధారణం గా కనిపించే లక్షణాలు:
- అసాధారణ యోని రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్చరిక సంకేతం..
- యోని నుండి నీరు మరియు చెడువాసనతో కూడిన రక్తస్రావం జరగడం
- శృంగారం చేసిన తర్వాత యోనిలో రక్తస్రావం
- నెలసరి మధ్య, మధ్య లో కూడా రక్తస్రావం
- యోనిలో మంట లేదా దురదకడుపు నొప్పి లేదా వెన్ను కింద నొప్పి
- విపరీతమైన అలసట
- మూత్రం ఆపుకోలేకపోవడం పొట్ట ఉబ్బరం