Trending

6/trending/recent

Business Idea: రూ.50,000 పెట్టుబడితో సంవత్సరానికి రూ.10 లక్షల సంపాదన

Business Idea: కొత్తగా ఏదైనా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా... అయితే తక్కువ ఖర్చుతో... ఎక్కువ లాభాలు వచ్చే ఈ వ్యాపారంపై ఓసారి దృష్టి పెట్టండి. మీకు ఉపయోగపడవచ్చు.

ఇంటి దగ్గరే ఉంటూ వ్యాపారం చెయ్యాలనుకుంటే... మీకు ఈ బిజినెస్ బాగా సెట్ అవుతుంది. పైగా మీరు ప్రతీ సంవత్సరం లక్షలు సంపాదించవచ్చు. వ్యాపారం ఏంటంటే అలోవెరా (కలబంద - aloe vera) సాగు. ఇప్పుడున్న రోజుల్లో తక్కువ పెట్టుబడితో... ఎక్కువ లాభాలు వచ్చే టాప్ వ్యాపారాల్లో ఇది కూడా నిలిచింది. ఇప్పటికే చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలో వెరాకు డిమాండ్ పెరుగుతోంది. ఎన్ని మొక్కల్ని పెంచినా... ఇంకా ఇంకా కావాలని అంటున్నాయి ఫార్మా, కాస్మెటిక్, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీలు. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే... అలోవెరా సాగు చాలా తేలికైనది... నష్టాలు దాదాపుగా ఉండని వ్యాపారం.

విపరీతమైన డిమాండ్:

ఈ రోజుల్లో ప్రజలకు అందంపై ఆసక్తి పెరిగింది. దాంతో... రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారు. చాలా సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో అలొవెరా వాడుతారు. అందువల్ల ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కరోనా వచ్చాక... డిమాండ్ దాదాపు 3 రెట్లు పెరిగింది. కొన్ని కంపెనీలైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సాగును రైతులతో చేయించుకుంటున్నాయి. మీరు వ్యాపార కోణంలో అలోవెరా సాగు చేపడితే మీకు సంవత్సరానికి రూ.8 నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది అని చెబుతున్నారు.

ఉద్యోగాల కంటే ఇదే మేలు:

చెబితే నమ్మరేమోగానీ... చాలా మంది MBA, ఇంజినీరింగ్ చదివి కూడా... ఉద్యోగాలు మానేసి... అలోవెరా సాగు చేస్తున్నారు. ఎందుకంటే దీన్లో లాభాల సీక్రెట్‌ను వాళ్లు కనిపెట్టేశారు. ఉద్యోగాలు చేస్తూ లేని పోని టెన్షన్లు పెంచుకునే కంటే... అలోవెరా పెంచుకుంటే మేలు అని వాళ్లకు కిటుకు తెలిసిపోయింది. ఓ వ్యాపారవేత్త టెన్షన్ తగ్గించుకునేందుకు గోధుమలు, దుంపల సాగు చేపట్టాడు. వ్యాపారం కంటే అవి బాగా కలిసొచ్చాయి. దాంతో ఆయన అలోవెరా సాగు చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి అలోవెరా మొక్కలు తెప్పించుకొని పెంచుతున్నాడు. సొంత తోట నుంచి లక్షలు సంపాదిస్తున్నాడు.

శిక్షణ ఉంటుంది:

అలోవెరా మొక్క మనం వద్దన్నా పెరుగుతుంది. మనం కొన్ని రోజులపాటూ నీరు పొయ్యకపోయినా సర్దుకుపోతుంది. ఎలాగొలా పెరుగుతుంది. అది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తుంది. మీరు అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలి అనుకుంటే... మీకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కొన్ని నెలలపాటూ ట్రైనింగ్ ఇస్తుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాక ట్రైనింగ్ మొదలవుతుంది.

అలోవెరా ఎలా పెంచాలి?

అలోవెరాకి మన దేశ వాతావరణం బాగా సెట్ అవుతుంది. విపరీతమైన ఎండలు అవసరం లేదు. సాధారణ ఎండ ఉన్నా పెరుగుతుంది. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు. సంవత్సరమంతా పెరుగుతుంది. విపరీతమైన చల్లదనం ఉంటే మాత్రం మొక్క పెరగడానికి ఇబ్బంది పడుతుంది. ఎలాంటి నేలలోనైనా ఇది పెరగగలదు.
ఇసుక రకం నేలలైతే ఈ మొక్కకు బాగా సెట్ అవుతాయి. నల్ల నేలలో కూడా బాగా పెరుగుతుంది. ఐతే... భూమిలో జలాలు (భూగర్భ జలాలు) కాస్త ఎక్కువగా ఉండే నేలను ఎంచుకోవాలి. అలాగే మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. జులై నుంచి ఆగస్ట్ మధ్య ఈ మొక్కల్ని నాటాలి.

ఎంత ఖర్చు అవుతుంది?

ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రకారం... ఒక హెక్టార్ (2.4 ఎకరాలు) సాగుకి రూ.27,500 ఖర్చు అవుతుంది. కూలీలకు వేతనాలు, సాగు ఏర్పాట్లు, పురుగు మందులు అన్నీ కలిపి మొత్తం ఏడాదికి ఖర్చు రూ.50,000 దాకా అవుతుంది. హెక్టార్ పొలంలో సంవత్సరానికి 40 టన్నుల నుంచి 50 టన్నుల అలోవెరా ఆకులు వస్తాయి. మీరు ఆయుర్వేద కంపెనీలు, కాస్మెటిక్, సబ్బుల తయారీ కంపెనీలకు వాటిని అమ్మవచ్చు. ఆకులు మందంగా, పెద్దగా ఉంటే... వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా చోట్ల టన్ను ఆకులకు రూ.15,000 నుంచి రూ.25,000 దాకా ఇస్తున్నారు. అందువల్ల మీకు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది.


Post a Comment

2 Comments
  1. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి నెంబర్ ఉంటే పెట్టండి

    ReplyDelete
  2. Give more information about aloevera cultivation

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad