Trending

6/trending/recent

Antibodies In Kid: అప్పుడే పుట్టిన చిన్నారిలో కరోనా యాంటీ బాడీస్‌ను గుర్తించిన వైద్యులు.. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు..

 Covid 19 Antibodies In Just Born Baby: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి యావత్‌ మానవాళికి ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది. ఆరోగ్యం నుంచి జీవనశైలి వరకు అన్నింటిలో మార్పులకు కారణమైందీ కంటికి కనిపించని వైరస్‌. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన ప్రారంభంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గర్భవతిగా ఉన్న మహిళ జన్మనిచ్చే బిడ్డకు కరోనా వస్తుందా.? ఆ తల్లి బిడ్డకు పాలివ్వొచ్చా లాంటి అంశాలు చర్చకు దారి తీశాయి.

ఇదిలా ఉంటే తాజాగా కోవిడ్‌19ను అంతమొందించేందుకు గాను వ్యాక్సిన్‌ అంఉబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఓ సంఘటన వైద్యులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. గర్భవతిగా ఉన్న ఓ మహిళ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ తీసుకుంది. దీంతో ఆ తల్లికి జన్మించిన చిన్నారి శరీరంలో పుట్టుకతోనే యాంటీ బాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ మహిళ ఫ్లోరిడాలోలో హెల్త్‌ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ను సదరు మహిళలకు బిడ్డకు జన్మనిచ్చే మూడు వారాల ముందు ఇచ్చారు. ఆ సమయానికి ఆమె 36 వారాల గర్భిణి. ఇక గత జనవరిలో జన్మించిన ఈ చిన్నారి రక్తాన్ని పరిశీలించగా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. ఇలా అప్పుడే పుట్టిన చిన్నారిలో యాంటీ బాడీలు గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఈ యాంటీబాడీలు చివరి మూడు నెలల్లో చిన్నారిలోకి ప్రవేశించాయని చెబుతున్నారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యులు‌ తెలిపారు. ఇక 2003లో వచ్చిన సార్స్‌ మహమ్మారి విషయంలో కూడా ఇలాగే జరిగే అవకాశాలున్నాయనేది పరిశోధకుల అంచనా.


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad