Trending

6/trending/recent

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండగకు ముందే కీలక ప్రకటన..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డీఏ పెంపు ఉండే అవకాశం ఉంది. హోళీ పండగకు ముందు ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే కేంద్ర సర్కార్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా జూన్‌ తర్వాతే ఇవన్నీ అమలయ్యే అవకాశం ఉంది. కేంద్ర సర్కార్‌ పెంచబోయే డీఏ అమలులోకి వస్తే ప్రస్తుతం వస్తున్న 17 శాతం డీఏ కాస్త 28 శాతానికి చేరుకుందని సమాచారం. అయితే డీఏ పెరిగితే టీఏ (ట్రావెల అలవెన్స్‌) కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఉద్యోగులకు కలిసి రానుంది. కేంద్ర సర్కార్‌ ఉద్యోగులకు డీఏ పెరగడం ద్వారా వాళ్ల పీఎఫ్‌ బ్యాలెన్స్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్‌ అలవెన్స్‌ బెనిఫిట్స్‌ జూలై 1 నుంచి పొందే అవకాశం ఉండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడవ వేత సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇటీవల పార్లమెంట్‌లో సైతం ప్రస్తావించారు. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ బెనిఫిట్స్‌ పొందే పొందనున్నారు. కేంద్ర సర్కార్‌ తాజా ప్రకటనపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యో్గులకు డియర్నెస్‌ అలవెన్స్‌ (డీఏ), డీఆర్‌ మూడు వాయిదాల బకాయి ఉంది. వీటిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి చెల్లించలేదు. జనవరి 1, 2020 నుంచి ఇప్పటి వరకు మూడు దఫాలు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఆర్‌, డీఏలను జూలై 1,2021 నుంచి చెల్లించనున్నారు. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా డీఏ, డీఆర్‌లను కేంద్రం చెల్లించడం లేదు. కాగా, గత ఏడాది కేంద్రం ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దాంతో వారికి కొత్త డీఏ ప్రకారం..మొత్తం 21శాతం రానుంది. బకాయిపడ్డ డీఏలను సైతం పెంచితే వారికి ఏకంగా 28శాతం డీఏ ఇవ్వాల్సి ఉంటుంది.


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad