Trending

6/trending/recent

AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?

టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్‌పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి.. కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్టు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

AP: Mega DSC Notification File Signed by CM Chandra babu Naidu

AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?

  • 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు
  •  ఎస్జీటీలు పోస్టులు 6371
  •  పీఈటీ పోటస్లు 132
  •  స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7725
  •  టీజీటీ పోస్టులు 1781
  •  పీజీటీ పోస్టులు 286
  •  ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..

AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టిసారించారు.. అందులో భాగంగా వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం.. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మెగా డీఎస్సీ కీలకంగా మారింది.. ఒకే సారి 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్‌..

ఇక, సీఎం చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయగా.. ఆ మెగా డీఎస్సీ ద్వారా ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్న విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వం.. 16,347 పోస్టుల మెగా డీఎస్సీ ద్వారా.. ఎస్జీటీలు పోస్టులు 6,371.. పీఈటీ పోటస్లు 132, స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. కాగా, ఈ ఏడాది ఆదిలోనే వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవటంతో కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీంతో డీఎస్సీ షెడ్యూల్ వాయిదా పడింది. వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించారు.. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించింది. వీటికి సంబందించి ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. డీఎస్సీతో పాటు టెట్ ఫలితాల విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఇక, మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన నేపథ్యంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నూతన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతల చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేయడం గమనార్హం. ఇక  అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ లో బయలుదేరారు. భారీ హోర్డింగ్ లు, గజమాలలతో ఆయనకు దారి పొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గ మధ్యలో తన కాన్వాయ్ ని ఆపి వారితో మాట్లాడారు.

అనంతరం సచివాలయానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహించిన తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం చేశారు. పింఛన్లు రూ.4వేలు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేశారు. పింఛన్ల పెంపు పై సంతకం చేసే సమయంలో వికలాంగులు, వృద్ధులు కొందరూ అక్కడికి చేరుకొని చంద్రబాబుకు నమస్కారాలు చేశారు.  అలాగే అన్న క్యాంటిన్ పున:ప్రారంభం పైల్ పై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52) ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad