Trending

6/trending/recent

Wedding Season: దేశంలో మళ్ళీ మొదలుకానున్న పెళ్లిళ్ల సీజన్.. 38 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నదంటే..

గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. పెళ్లిళ్ల సీజన్ కార్తీక మాసం ఏకాదశి నుంచి నవంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ సీజన్ డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. తిధి, నక్షత్రాల లెక్కల ప్రకారం నవంబర్‌లో  23, 24, 27, 28, 29 తేదీల్లో వివాహ ముహర్తాలు ఉండగా.. డిసెంబర్ నెలలో 3 , 4, 7, 8, 9లతో పాటు 15వ తేదీలు వివాహానికి అనుకూలమైన రోజులు. 

Wedding Season: దేశంలో మళ్ళీ మొదలుకానున్న పెళ్లిళ్ల సీజన్.. 38 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నదంటే..

దేశంలో దీపావళి పండుగ సీజన్‌లో రికార్డు బ్రేకింగ్ అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. నవంబర్ 23 నుండి దేశంలో ప్రారంభమయ్యే వివాహ సీజన్‌లో వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ఆశాజనకంగా ఉంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల వివాహాలు జరగనుండగా ఈ పెళ్లి వేడుకల ద్వారా దేశంలోని హోల్ సేల్, రిటైల్ వ్యాపార రంగంలో వస్తువుల సేవలతో కలిపి రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది.

గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. పెళ్లిళ్ల సీజన్ కార్తీక మాసం ఏకాదశి నుంచి నవంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ సీజన్ డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. తిధి, నక్షత్రాల లెక్కల ప్రకారం నవంబర్‌లో  23, 24, 27, 28, 29 తేదీల్లో వివాహ ముహర్తాలు ఉండగా.. డిసెంబర్ నెలలో 3 , 4, 7, 8, 9లతో పాటు 15వ తేదీలు వివాహానికి అనుకూలమైన రోజులు.

దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రధాన పంపిణీ కేంద్రాలుగా పిలువబడే వివిధ రాష్ట్రాల్లోని   30 వేర్వేరు నగరాల్లోని ప్రముఖ వ్యాపార సంస్థలు, వస్తువులు, సేవల్లో వివిధ వాటాదారులతో మాట్లాడిన తర్వాత మొత్తం పెళ్లిళ్లు అంచనా వేయబడ్డాయి. దాదాపు 38 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో చివరి పెళ్లిళ్ల  సీజన్‌ మొదలు కానుంది. వివాహాల కోసం షాపింగ్ చేయడం, వివాహ సేవలను పొందడం ద్వారా దాదాపు రూ. 4.74 లక్షల కోట్ల భారీ వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు.

ఢిల్లీలో రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం

ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని.. దీని ద్వారా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని క్యాట్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. CAT చేసిన అంచనాల ఆధారంగా ఈ సీజన్‌లో దాదాపు 7 లక్షల వివాహాలు రూ. 3 లక్షల వ్యయంతో నిర్వహించబడతాయని, 8 లక్షల వివాహాలు రూ. 6 లక్షల వ్యయంతో, 10 లక్షల వివాహాలు జరుగుతాయని భారతీయా, ఖండేల్‌వాల్‌లు తెలిపారు. 10 లక్షలతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ. 15 లక్షలతో 5 లక్షలు, రూ. 25 లక్షలతో 5 లక్షల పెళ్లిళ్లు, రూ. 50 లక్షలతో 50 వేలు, రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

పెళ్లిళ్లతో పెరిగే అమ్మకాలు

సాధారణంగా వివాహానికి అయ్యే ఖర్చులో 50% వస్తువుల కొనుగోలుపై, 50% సేవల కొనుగోలుపై ఖర్చు అవుతుందని భర్తియా, ఖండేల్వాల్ పేర్కొన్నారు. వస్త్రాలు, చీరలు, లెహెంగా, దుస్తుల్లో 10%, ఆభరణాలలో 15%, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ , వినియోగ వస్తువులలో 5%, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ స్వీట్లు , నామ్‌కీన్స్‌లో 5%, ఆహార ధాన్యాలు, కిరాణా, కూరగాయలలో 5%, బహుమతి వస్తువులలో 4%  ఇతర ఇతర వస్తువులలో మిగిలిన 6% వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇతర సేవా రంగంలో

సేవా రంగానికి సంబంధించినంత వరకు బాంకెట్ హాల్స్, హోటళ్లు, ఇతర వివాహ వేదికలపై 5%, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పై 5%, టెంట్ డెకరేషన్‌పై 12%, క్యాటరింగ్ సర్వీసెస్‌పై 10%, ఫ్లవర్ డెకరేషన్‌పై 4%, 3% ట్రావెల్, క్యాబ్ సేవలపై 2%, ఫోటో అండ్ వీడియో షూట్‌లకు 2%, ఆర్కెస్ట్రా, బ్యాండ్ మొదలైనవాటిపై 3%,   లైటింగ్ అండ్ డీజే కు 3% లతో పాటు మిగిలిన 3% ఇతర ఇతర సేవలపై ఖర్చు చేస్తారని వ్యాపార సంస్థలు లెక్కిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ తర్వాత క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ విక్రయాలు ఉంటాయని, ఆ తర్వాత సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ మొదలు అవుతుందని భర్తియా, ఖండేల్‌వాల్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad